calender_icon.png 16 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

15-01-2025 11:42:40 PM

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): ఈ మధ్య తరచుగా హైదరాబాద్ మహానగరంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా మియాపూర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బుధవారం మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కె.క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో పిల్లర్ 603 వద్ద మంగళవారం రాత్రి మాదాపూర్ ఎస్‌ఓటీ టీమ్, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు అనుమానస్పదంగా కనిపించిన నాగర్ కర్నూల్ జిల్లా ఇంద్రకుల గ్రామానికి చెందిన ఇంద్ర కుమార్ (27)ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతని వద్ద 65 కిలోల ఎండు గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఇంద్ర కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అరకులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడని తెలిపారు. అరకు నుండి సంక్రాంతి పండుగకు సొంత గ్రామానికి వస్తుండగా అక్కడి నుండి నిషేధిత ఎండు గంజాయి తీసుకు వచ్చి స్థానికంగా విక్రయించాలనుకున్నట్లు తెలిపాడు. గతంలో ఇంద్ర కుమార్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో పట్టుబడి గత ఏడాదిలో జైలుకు వెళ్ళి వచ్చాడు. అయినా తీరు మార్చుకోని అతను మరోసారి గంజాయి విక్రయిస్తూ దొరికాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.