మంచిర్యాల : బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో మందమర్రికి చెందిన మేకల గంగాధర్ 19 అనే యువకునికి 2 కిలోల గంజాయి అమ్మిన మహారాష్ట్ర లోని చంద్రాపూర్ బెంగాలీ క్యాంపుకు చెందిన విశ్వదేవ్ మిశ్రా 35 అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దిన్ తెలిపారు. అతని వద్ద నుండి 58 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితున్ని కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన వెల్లడించారు.