చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
కొండపాక, జనవరి 28 : నిషేధిత గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన కుకునూరుపల్లి పోలీసులు. కుకునూరుపల్లి ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కుకునూరుపల్లి మండలం లోని మెదిని పూర్ గ్రామంలో డైరీ ఫార్మ్ లో పని చేస్తున్న బీహార్ కు చెందిన సుధీర్ కుమార్, మెదినిపూర్ గ్రామానికి చెందిన కొంతమంది యువకులకు గంజాయి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడని నమ్మదగిన సమాచారంతో పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు.
ఎస్ ఐ శ్రీనివాస్, తమ సిబ్బందితో కలిసి పట్టుకొని మందలించడం తో సుధీర్ కుమార్ తను చేస్తున్న నేరాలు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.