నిందితుడి వద్ద నుంచి 1.5 కేజీల గంజాయి, రూ.7వేల 200 స్వాధీనం
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): కర్ణాటకలోని బీదర్ నుండి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసుల అదుపులోకి డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో చందానగర్ లో గంజాయి తరలిస్తున్న షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1.5కేజీల గంజాయితో పాటు ఆటో రిక్షా,మొబైల్ ఫోన్ రూ.7వేల 200 స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఆసిఫ్ బీదర్ నుండి తన ఆటోలో ఎండు గంజాయిని అక్రమంగా తరలిస్తూ నగరంలోని హఫీజ్పేట్ మియాపూర్, కొండాపూర్,నానాకరంగుడా, గచ్చిబౌలి,ప్రాంతాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ఐటి ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిందితుడిపై ఎన్టీపీఎస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడులు డిటిఎఫ్ సిఐ ప్రవీణ్ కుమార్,ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఫక్రుద్దీన్, నెహ్రూ, నిఖిల్,సాయి శంకర్, ఎన్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.