calender_icon.png 20 April, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాలో అమ్మాయికి వేధింపులు వ్యక్తి అరెస్ట్

19-04-2025 12:00:00 AM

బోథ్, ఏప్రిల్ 18 (విజయ క్రాం తి): సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయి ని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకూర్తి గ్రామానికి చెందిన అలీమ్‌బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు  తరలించామని బోథ్ ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

నిందితుని పై రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని, అలాగే డిచ్పల్లి పోలీస్ స్టేషన్‌లో మోటర్ సైకిల్ దొంగతనం కేసు సైతం ఉందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా  అసభ్యకర పోస్టులు పెట్టిన, వేధించిన, తప్పుడు సమాచారాలు పెట్టిన  అలాంటి వారిపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.