calender_icon.png 26 April, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టుకు గైర్హాజరు అవుతున్న వ్యక్తి అరెస్ట్

23-04-2025 06:29:27 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ నగర్ కు చెందిన ఇడిగినాలా సుధాకర్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కొంతకాలంగా కోర్టు వాయిదాలకు గైర్హాజరవుతూ తప్పించుకు తిరుగుతున్న సుధాకర్ ను అరెస్టు చేసి బెల్లంపల్లి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(Bellampalli Judicial First Class Magistrate) ముందు హాజరు పరిచినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్(SI Kiran Kumar) తెలిపారు. సుధాకర్ పై విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారునీ అడ్డుకున్న కేసు నమోదు అయిందనీ తెలిపారు. అట్టి కేసులో అతను కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతుండడంతో అతన్ని అరెస్టు  బెల్లంపల్లి జడ్జి ముందు హాజరు పరిచి ఆసిఫాబాద్ సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.