08-04-2025 09:54:45 AM
ఎమ్మెల్యే ఫొటోలతో యువతులకు బురిడీ
షాదీ డాట్ కామ్ మోసగాడి కేసులో సంచలన విషయాలు
యానాం ఎమ్మెల్యే ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా వాడుకొని మోసం
పెళ్లి పేరుతో డబ్బులు వసూల్
వంశీకృష్ణను అరెస్ట్ చేసి విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు..
హైదరాబాద్: ఎమ్మెల్యే ఫొటోలతో యువతులను బురిడీ కొట్టించాడు ఓ మోసగాడు. షాదీ డాట్ కామ్ మోసగాడి కేసు(Shaadi.com fraud case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యానాం ఎమ్మెల్యే ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా వాడుకొని మోసాలకు పాల్పడ్డాడు. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతుల నుంచి పెళ్లి పేరుతో డబ్బులు వసూలు చేశాడు. అమ్మాయిలను ట్రాప్ లోకి దించి డబ్బులు దండుకున్న నిందితుడు వంశీకృష్ణను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee Hills Police Station) ప్రస్తుతం విచారిస్తున్నారు. నిందితుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ ఒకే కాలేజీలో చదివారు. స్నేహితుల పేరుతో మూడు సిమ్ కార్డులు వాడిన వంశీకృష్ణ ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి.