calender_icon.png 3 April, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ ట్రేడింగ్ పేరిట మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

28-03-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27(విజయక్రాంతి) : స్టాక్ ట్రేడింగ్ పేరిట మోసం చేస్తున్న  ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తిని అపరిచిత వ్యక్తి ఫిడిలిటీ ఇంటర్నేషనల్ వెల్త్ సెంటర్ అనే వాట్సప్ గ్రూప్‌లో చేర్చాడు. ఆ గ్రూప్‌లోని సభ్యులు తమకు ట్రేడింగ్‌లో వేచ్చే లాభాల స్క్రీన్ షాట్‌లను అందులో షేర్ చేశారు. అది నమ్మి సదరు వ్యక్తి కూడా ట్రేడింగ్ ఖాతాను తెరిచి పెట్టుబడులు పెట్టాడు. తన ఖాతాలను నడిపేందుకు సదరు వ్యక్తి గ్రూప్‌లోని సైబర్ నేరగాళ్లకు రూ.6.20లక్షలకు బదిలీ చేశాడు. బాధితుడు పెట్టుబడి వద్దనుకున్నపుడు సైబర్ నేరగాళ్లు అతన్ని బెదిరంచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. గుజరాత్‌కు చెందిన లలిత్‌కుమార్‌జైస్వాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిపై తెలంగాణలో 3కేసులు దేశవ్యాప్తంగా 16కేసులున్నట్లు గుర్తంచారు.