29-03-2025 12:04:09 AM
3.1తులాల 3 చైన్లను రికవరీ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): చైన్ స్నాచింగ్స్, దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హుమాయన్ నగర్ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. శుక్రవారం మెహదీపట్నంలోని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ జి.చంద్రమోహన్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న నల్లొండ జిల్లాకు చెందిన ముమ్మిడి మోహన్‌రెడ్డి అనే వ్యక్తి తాను ఎల్‌బీ నగర్ నుంచి మెహదీపట్నంకు ఆర్టీసీ బస్సులో వస్తుండగా తన 16గ్రామలు బంగారు చైన్‌ను పోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన హుమాయున్ నగర్ పోలీసులు లక్ష్మణ్ రాథోడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కాగా నిందితుడు బంగారు నగలను తక్కువ రేటుకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. లక్ష్మణ్‌రాథోడ్‌ను విచారించిన పోలీసులు అతని నుంచి 3.5 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. అతనితో పాటు సమీర్, అక్రమ్ అనే నిందితులు ఈ కేసుల్లో ఉన్నారని, వారు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. లక్ష్మణ్ రాథోడ్ మరో 4కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విలేకరుల సమావేశంలో సౌత్‌వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దిఖి, ఆసిఫ్‌నగర్ ఏసీపీ కె.విజయ్‌శ్రీనివాస్, హుమాయున్‌నగర్ సీఐ బాలకృష్ణ, డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ అహ్మద్‌పాష, తదితరులు పాల్గొన్నారు.