calender_icon.png 3 April, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య, అత్తను కొట్టిన కేసులో వ్యక్తి అరెస్ట్

02-04-2025 07:06:30 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ మండలంలోని అచ్చులాపూర్ పంచాయతీ పరిధిలోగల కొమ్ముగూడెం గ్రామానికి చెందిన దాగం మల్లేష్ అనే వ్యక్తిని మద్యం మత్తులో భార్య, అత్తను కొట్టి గాయపరిచిన కేసులో బుధవారం అరెస్టు చేసినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన కథనం మేరకు... మార్చి 16న సాయంత్రం అతిగా మద్యం తాగిన మల్లేష్ ఇంట్లో గొడవపడి భార్య లావణ్య, అత్త రాజును గరిటతో తలపై బలంగా కొట్టి గాయపరిచారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లేష్ ను అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.