calender_icon.png 12 February, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకు, భార్యపై హత్యాయత్నం వ్యక్తి అరెస్ట్

12-02-2025 01:44:44 AM

గోదావరిఖని, ఫిబ్రవరి 11: కన్న కొడుకు, భార్యపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని 1- టౌన్ సిఐ ఇంద్రసే నారెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో సీఐ మాట్లాడుతూ పట్టణంలోని గంగానగర్‌లో నివాసం ఉంటున్న మడిపల్లి ఉదయ్(30)  సింగరేణి ఉద్యోగి 2022 సం వత్సరంలో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరిద్దరిరు 8 నెల లు ఎంతో సాఫీగా జీవితాన్ని కొనసాగించిన తర్వాత మనసు పరదలొచ్చి అనూష వాళ్ళ తల్లిదండ్రుల  వద్ద ఉంటున్న జీఎం కాలనీకి వెళ్ళింది. వీరికి ఒక బాబు 18 నెలలు. ఆ త రువాత ఉదయ్ వేధింపులు భరించలేక అ నూష గోదావరిఖని 1- టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, 498 కేసు నామోదు కావడంతో, భార్యాభర్తల మధ్య కేసు నడుస్తు న్న క్రమంలో సాయంత్రం ఉదయ్ తన బైక్ వచ్చి తన భార్య తల్లిగారిల్లు ఇంటికి వెళ్లి భార్య, 18 నెలల తన కొడుకుపైన బైకుతో గుద్ది హత్యాయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు అడ్డుకోవడంతో తప్పించుకొని  పారి పోయాడు. అనూష ఫిర్యాదు మేరకు ఉద యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ తెలిపారు. అతడి నుంచి కారు, బైకును సీజ్ చేశామన్నారు.