25-03-2025 03:45:11 PM
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని పట్టణ ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. ఈనెల 23 23న రాత్రి సమయంలో న్యాయవాది సయ్యద్ ఎజాజ్ జహీరాబాద్ పట్టణములో ఉన్న డిల్లీ కిరాణ స్టోర్ ముందు మెయిన్ రోడ్డు పక్కన తన హోండా యాక్టివ బైకు పైన కూర్చొని అతని క్లయింట్ సయ్యద్ వసీం తో మాట్లాడుతుండగా, సివిల్ కేసులో ప్రతివాది అగు యం.డి. గౌస్ ఖురేషీ చెంప పై, చెవి పై చేతితో కొడుతూ కేసు విత్ డ్రా చేసుకోకపోతే చంపేస్తానని రాళ్ళు తీసుకొని చంపుటకు ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడు అగు యం.డి. గౌస్ ఖురేషీ ను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.