20-02-2025 04:44:42 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): తనపై ఎలాంటి కేసులు లేవని తప్పుడు చూపించి పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాసిపేట ఎస్సై వొల్లాల ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్టేషన్ పెద్దనపల్లికి చెందిన కోవెల శ్రావణ్ తనపై ఎలాంటి కేసులు లేవని తప్పుడు అఫీడవిట్ చూపించి పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పోలీసు స్పెషల్ బ్రాంచ్ ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి చెక్ బౌన్స్ కేసు ఉన్నట్లు వెల్లడించారన్నారు. తప్పుడు ధ్రువపత్రాలు చూపి సర్టిఫికెట్ పొందాలనుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.