04-03-2025 02:13:51 AM
మార్చి 8లోపు మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): వరంగల్ మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరుపెట్టాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. మార్చి 8వ తేదీలోపు మహిళలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తె చ్చేందుకు సోమవారం ఆమె పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పదివేల పోస్టు కార్డులను సీఎం కు పంపించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. హామీల అమలుపై ప్రకటన చేయకపోతే పది వేల మంది మహిళలం పదివేల గ్రామాల్లోకి వెళ్లి లక్షలాది పోస్టు కార్డులను తయారుచేసి సోనియా గాంధీకి పంపిస్తామని హెచ్చరించారు.