calender_icon.png 19 November, 2024 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8నెలల్లో మామునూర్ ఎయిర్‌పోర్ట్

19-11-2024 02:46:37 AM

ఉమ్మడి వరంగల్ జిల్లావాసుల కల నెరవేరుస్తాం

  1. మొదటి దశలో డొమెస్టిక్ సర్వీసులు
  2. రెండో దశలో అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యం
  3. మున్ముందు కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్ట్‌లపైనా కదలిక
  4. ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  5. సచివాలయంలో మీడియా సమావేశం

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): మామునూర్ ఎయిర్ పోర్ట్ పనుల ను త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్‌అండ్‌బీ సీఈ మోహన్‌నాయక్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.

నిన్నమొన్నటివర కు మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేవలం 150 కి.మీ దూరంలో ఉండడమనేది అడ్డుగా ఉండేదని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని జీఎంఆర్ సంస్థ ఆ నిబంధనను ఉపసంహరించుకునేలా ఒప్పించామని ప్రకటించారు.

ఇప్పటికే ఏవియేషన్, రెవెన్యూ అధికారులతో సమావేశమై ఎయిర్‌పోర్ట్‌కు కావాల్సిన భూసేకర ణ విషయమై చర్చించామన్నారు. నిర్మాణానికి 280.30 ఎకరాల భూమి అవసరమని, రైతుల నుంచి 253 ఎకరాలు సేకరించాల్సి ఉందని స్పష్టం చేశారు. భూసేకరణకు రూ. 205 కోట్లు విడుదల చేశామన్నారు.

భూసేకరణకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం లభిం చిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మామునూర్ ఎయిర్‌పోర్ట్ పేరుతో పదేళ్ల పాటు డ్రామాలు ఆడిందని, నిర్మాణానికి కనీసం ఒక్క ఇటుకనైనా వేయలేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే ఎయిర్‌పోర్టు పనులు పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మొదటి దశలో చిన్న విమానాల రాకపోకలకు అనువుగా నిర్మా ణం ఉంటుందని తేల్చిచెప్పారు. ఏడాదిన్నర తర్వాత రెండో దశలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మున్ముం దు కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పో ర్టులకు వీలైనంత త్వరగా అనుమతులు సాధిస్తామని హామీ ఇచ్చారు.

దీనిపై ఇప్పటికే కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో చర్చించామన్నారు. ఆయన ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు.

త్వరలో ఎన్‌హెచ్ 65 విస్తరణ పనులు

హైదరాబాద్ విజయవాడ (ఎన్‌హెచ్ విస్తరించాలని తాము కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామని, ఆయన ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ హైవేగా విస్తరించేందుకు సానుకూలంగా స్పందించారని మంత్రి  ప్రకటించారు. ప్రస్తు తం ఆ ప్రతిపాదన డీపీఆర్ స్థాయిలో ఉంద ని, జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

అలాగే హైదరాబాద్  ఎన్‌హె-చ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేశామన్నారు. ఉప్పల్ చౌరస్తా నుంచి సీపీఆర్‌ఐ నారపల్లి 5 కి.మీ మేర ఉన్న ఫ్లుఓవర్ నిర్మాణంలో భాగమైన ఫ్లుఓవర్ దాదాపు పూర్తయిందన్నారు. ఉప్ప ల్ నుంచి మేడిపల్లి వరకు ఫ్లుఓవర్ పూర్తి కావడానికి ఏడాదిన్నర పడుతుందని, పను లు పూర్తయ్యాక ప్రయాణికులు ఉప్పల్ నుంచి వరంగల్ కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చన్నారు.

నల్లమలలో ఘాట్ రోడ్డులో ప్రయాణం ఆలస్యం కాకుండా, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా సింగిల్ పిల్లర్ విధా నంలో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. పనులకు కేంద్రం ఆమోదం తెలిపితే అద్భుతమైన జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016లో ఆర్‌ఆర్‌ఆర్‌న ప్రతిపాదించిందని, కేవలం రెండు బ్రిడ్జిలు కట్టి తామే హైదరాబాద్ నిర్మాతలమని చెప్పుకొన్నదని ఎద్దేవా చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డు నిర్మాణం మొద ట కేంద్రమే నిర్మిస్తుందనే ప్రచారం జరిగిందని, కేంద్రం ముందుకు రాకపోవడంతో ఇప్పుడు తామే  దక్షిణ భాగంలో రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు.

వచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో ఇప్పటివరకు 94% భూసేకరణ పూర్తి చేశామని, వాస్తవానికి 80% భూసేకరణ పూర్తయితే టెండర్లు పిలువచ్చని, కానీ.. ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటివరకు టెండర్లు పిలువలేదన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహ పనుల పరిశీలన

మీడియా సమావేశం అనంతరం మంత్రి సచివాలయంలో తెలంగాణ తల్లి నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి డిసెంబర్ మొదటి వారం లోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కిషన్‌రెడ్డి కేంద్రమంత్రా? గల్లీ లీడరా?

80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకొన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బయటకొచ్చి.. ‘నల్లగొండ ప్రజ లు చచ్చినా ఫర్వాలేదు. మూసీ ప్రక్షాళన ఆపాలి’ అనే పిలుపునిస్తే తాము మూసీ ప్రక్షాళనను నిలిపివేస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే బీఆర్‌ఎస్ ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు.

రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై దాడి చేశార ని ఆరోపించారు. గతంలోనే అనేక ఆరోపణలతో జైలుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నేత అరెస్టుతై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  కేంద్ర మంత్రిలా కాకుండా, గల్లీ నేతల వ్యవహరిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో ఉండి దేశ ప్రజలకు మేలు చేసే పను లు చేయకుండా, గల్లీలోకి వెళ్లి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో దోమల బాధ తట్టుకోలేకే కేంద్ర మంత్రి హైదరాబాద్‌లో మకాం వేశారని ఎద్దేవా చేశారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం తన హోంశాఖను పట్టించుకోవడం లేద ని, ఆయన మణిపూర్ అల్ల ర్లపై దృష్టి సారించి, శాంతిస్థాపన చేస్తే బాగుంటుందని హితవు పలికారు.