చాంగ్జౌ (చైనా): చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ యువ షట్లర్ మాళవిక బన్సోద్ సంచలనం సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ప్రపంచ ఏడో ర్యాంకర్ మరిస్కాకు మాళవిక షాక్ ఇచ్చింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మాళవిక 26-24, 21-19 తేడాతో మరిస్కా (ఇండోనేషియా)పై విజయాన్ని అందుకొని ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. కేవలం 46 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. ప్రిక్వార్టర్స్‌లో మాళవిక స్కాట్లాండ్ క్రీడాకారిణి క్రిస్టినా గిల్‌మోర్‌తో తలపడనుంది.
మిగిలిన సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, సమి యా తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి తొలి రౌండ్‌కే పరిమితమయ్యాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-త్రిసా జాలీ జంట చైనీస్ తైపీ జోడీ పెయ్ షాన్- హంగ్ చేతిలో పరాజయం పాలైంది. మరో డబు ల్స్ జోడీ రుతుపర్ణ-శ్వేత పర్ణ నిరాశపరిచారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కి రెడ్డి జోడీ కియాన్-జింగ్ (మలే షియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది.