calender_icon.png 22 January, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్ ఫైనల్లో మాళవిక

20-09-2024 12:00:00 AM

చైనా ఓపెన్ 

చాంగ్జౌ (చైనా): చైనా ఓపెన్‌లో భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. సూపర్- 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మాళవిక తొలిసారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మాళవిక 21-17, 19-21, 21-16తో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టినా గిల్‌మోర్‌ను ఓడించింది. రెండుసార్లు కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, ప్రపంచ 25వ ర్యాంకర్ అయిన గిల్‌మోర్‌ను మాళవిక ఓడించడం ఇదే తొలిసారి. తొలి నుంచి హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌ను మాళవిక గెలుచుకోగా.. రెండో గేమ్ క్రిస్టినా దక్కించుకుంది.

దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌లో దూకుడు ప్రదర్శించిన మాళవిక గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గంటకు పైగా సాగిన పోరులో మాళవిక 61 ర్యాలీలతో పాటు 61 పాయిం ట్లు గెలుచుకోగా.. క్రిస్టినా 54 ర్యాలీలకే పరిమితమైంది. ఇక క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యమాగుచి (జపాన్)తో మాళవిక తలపడనుంది.