calender_icon.png 11 January, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాళవిక బన్సోద్ సంచలనం

09-10-2024 12:27:25 AM

ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

వన్‌టా (ఫిన్‌లాండ్): భారత స్టార్ షట్లర్ మాళవిక బన్సోద్ సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ ఏడాది అద్వితీయంగా రాణిస్తున్న మాళవిక ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మాళవిక 21-19, 24-22తో ప్రపంచ 23వ ర్యాంకర్ సుంగ్ యున్ (చైనీస్ తైపీ)ని చిత్తు చేసింది.

57 నిమిషాల పాటు సాగిన పోరులో సుంగ్‌ను మాళవిక వరుస గేముల్లో మట్టి కరిపించడం విశేషం. ఇక ప్రిక్వార్టర్స్‌లో మాళవిక మాజీ చాంపియన్‌ను ఎదుర్కొనే అవకాశముంది. 2013 వరల్డ్ చాంపియన్ ఇంటానన్, 2022 ప్రపంచ చాంపియన్ వాంగ్ జీ మధ్య విజేతతో మాళవిక తలపడనుంది. పీవీ సింధు 16-21, 10-21 తేడాతో కెనడాకు చెందిన మైఖేల్ చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.