calender_icon.png 5 January, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలోత్ సిద్దు నాయక్ తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకం

02-01-2025 08:31:43 PM

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో చదివి నీట్ ఎంట్రెన్స్ పరీక్షలో స్టేట్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి బిటెక్ మెకానిక్ లో సీటు సంపాదించిన మాలోత్ సిద్ధి వినాయక్ తోటి విద్యార్థులకు స్ఫూర్తినింపడానికి మార్గదర్శకుడిగా నిలవడం చాలా సంతోషమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం నాడు తన చాంబర్లో సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన మాలోతు సిద్ధి వినాయక్, నీట్ పరీక్ష రాసి అత్యుత్తమ ర్యాంకు సాధించి, ఎస్టి కోటలో బీటెక్ మెకానిక్ గుజరాత్ లోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానిక్ లో సీటు సంపాదించాడని ఆయన అన్నారు. ఒకటో తరగతి నుండి 10వ తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్మీడియట్ చైతన్య జూనియర్ కాలేజీ ఖమ్మం నందు చదువుకొని నీట్ పరీక్ష రాశాడని ఆయన అన్నారు.

మాలోత్ సిద్ధి వినాయక్ తల్లిదండ్రులు నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని ఆయన తెలుపుతూ, రెండవ సంవత్సరం బీటెక్ మెకానిక్ కోర్స్ చదవడానికి ప్రోత్సాహకంగా ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుండి 50 వేల రూపాయలు చెక్కును అతని తండ్రికి అందించడం జరిగిందని అన్నారు. చెక్కు అందించిన అనంతరం తల్లిదండ్రులకు అభినందిస్తూ ఖాళీ సమయంలో క్రింది తరగతి  విద్యార్థులకు తప్పనిసరిగా మీ యొక్క ప్రతిభను వారికి తెలియజేసి చదువు పట్ల మక్కువ కలిగేలా స్ఫూర్తి నింపాలని, తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం మోపకుండా నెలకు కొంత ఆర్థిక వెసులు బాటు చేసుకోవడానికి ప్రయత్నించాలని విద్యార్థికి తెలియజేయాలని ఆయన తండ్రికి సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, బాలుడు తండ్రి కరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.