calender_icon.png 16 January, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపన్నుల్లోనూ పోషకాహార లోపం

08-07-2024 01:19:05 AM

54 శాతం ధనికుల పిల్లల్లోనే న్యూట్రిషన్ కొరత

వైవిధ్య ఆహారం తీసుకోవడమే సమస్యకు పరిష్కారం

యూనిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 7: భారత్‌లో పోషకాహార లోపం కేవలం కుటుంబ ఆదాయానికి సంబంధించే కాదని యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఈ లోపంతో బాధపడుతున్న పిల్లల్లో సగానికిపైగా సంపన్న కుటుంబాలకు చెందినవారు ఉన్నారని రిపోర్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. భారత్‌లో పిల్లల ఆరోగ్యంపై పోషకాహార లోపం ప్రభావం తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని వెల్లడించిం ది. చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 18.1 కోట్ల మంది తీవ్రమైన పోషకాహార లోపం తో బాధపడుతున్నారు. వీరిలో అత్యధికంగా భారత్, చైనా, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో 65 శాతం మంది ఉన్నట్లు పేర్కొ ంది. వీరిలో ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతంలో నివసించే ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది. 

40 శాతమే పేదరికం కారణం

భారత్‌లోనూ పిల్లల్లో 40 శాతం మంది ఈ లోపంతో ప్రభావితమవుతున్నారు. దేశ ంలో చాలా వరకు పోషకాహార లోపానికి పేదరికం కారణంగా చెప్పుకోవచ్చు. మధ్యతరగతి, ధనిక కుటుంబాల్లోనూ పోషకా హారం లోపం ఎక్కువగా కనిపిస్తోందని యునిసెఫ్ రిపోర్ట్ పేర్కొంది. కేవలం తక్కువ పోషకాలు అందించడం ద్వారానే పరిస్థితి ఏర్పడదని, పిల్లలకు తినిపించే విధానాలు, వాతావరణం కూడా ప్రభావం చూపిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. పిల్లలు ఐదేళ్లు దాటే వరకు వారు తీసుకునే పోషకాలు, వివిధ రకాల ఆహారాన్ని పొందలేకపోవటమే పోషకాహార లోపానికి ప్రధాన కారణ ంగా వివరించింది.

నివేదిక ప్రకారం పోషకాహార లోపానికి కేవలం పేదరికమే కారణం కాదని తెలిపింది. ఈ లోపంతో బాధపడేవారిలో సగానికిపైగా ధనవంతుల పిల్లలు ఉం డటం దీన్ని రుజువు చేస్తుందని వెల్లడించిం ది. బాధిత పిల్లల్లో 46 శాతం మంది పేద కు టుంబాలకు చెందినవారు ఉండగా.. 54 శాతం మంది దారిద్య్రరేఖకు ఎగువన జీవిస్తున్న కుటుంబాల నుంచి ఉన్నారు. ఇందు కు కారణం పేలవమైన ఆహార పదార్థాలు, చౌకైన అనారోగ్యకరమైన ఆహారాలు.. అధిక ధరలు పౌష్టికాహారాన్ని దూరం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

అవగాహన లేమితోనే..

పాలు లేదా అన్నం ఆహారంగా తీసుకునే పిల్లలు 50 శాతం పోషకాహార లేమికి గురవుతున్నట్లు యునిసెఫ్ నివేదిక వెల్లడి ంచింది. రోజూ కనీసంగా 5 లేదా అంతకన్నా ఎక్కువ రకాల ఆహారాలు తీసు కోవాలని నివేదిక సిఫార్సు చేస్తోంది. తల్లిపాలు, డెయిరీ ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పులు, విత్తనాలతో పాటు విటమిన్ ఏ లభించే పండ్లు, కూరగాయలు, ధా న్యాలు, దుంపలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వివిధ రకాల ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమని, అందుకు తగినట్లు ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించ డం అవసరమని పేర్కొంది. ఈ విషయంలో భారత్ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. కుటుంబాలు, పిల్లలకు ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చే ముందు దేశంలో పేదరిక సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది.