calender_icon.png 20 March, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్యాయంపై తిరుగుబాటు చేసిన ధీర వనిత మల్లు స్వరాజ్యం

20-03-2025 12:00:00 AM

మల్లు స్వరాజ్యం వర్ధంతిలో మంత్రి సీతక్క

ముషీరాబాద్, మార్చి 19: (విజయక్రాంతి): అన్యాయంపై తిరుగుబాటు చేసిన ధీరవనిత మల్లు స్వరాజ్యం అని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.  అగ్రకులంలో పుట్టి వందలాది ఎకరాల ఆస్తిపాస్తులు ఉండి కూడా భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జీవితాంతం నిస్వార్ధంగా పేదలకు జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబా టు జెండా ఎగురవేసిన ధీరవనిత దళ కమాండర్‌గా అడవుల్లో పనిచేసిందని తెలిపారు.

ఈ మేరకు బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం తెలం గాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సందర్భంగా మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం ఎంతో స్ఫూర్తిదా యకమైన జీవితం ఆమెదని అన్నారు.

నేను దళాల్లో పనిచేసినప్పుడు స్వరాజ్యం చరిత్ర చదివి మమ్మల్ని మేము చక్కదిద్దుకోవటానికి సరైన విధంగా జనాలతో మమేకం కావటానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు మల్లే స్వరాజ్యం గారి స్ఫూర్తి మనమంతా పునికిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ట్యాంక్ బండ్‌పై విగ్రహ ఏర్పాటు కోసం, అలాగే మల్లు స్వరాజ్యం ట్రస్టు ఏర్పాటు కోసం స్థలం కేటాయించేలా మాట్లాడుతానని, ఆ పని జరిగేలా చూస్తానని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి  మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం వ్యక్తి కాదని ఆమె ఒక మహాశక్తి అని అన్నారు. స్వరాజ్యం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. ఆమె స్ఫూర్తిని తీసుకొని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్యా యం దౌర్జన్యాలు ఎక్కడ జరిగిన పేదల పక్షాన నిలబడుతుంది పోరాడుతుంది అని కొనియాడారు.

రాబోయే కాలంలో మన సమాజాన్ని బాగు చేసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల నుండి బయటపడడానికి మల్లు స్వరాజ్యం లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందు ముందు జరిగే పోరాటంలో భాగస్వాములై ఆమె ఆశయాలను ముందుకు తీసుకపోవటానికి ముందుకు సాగాలని అన్నారు.

సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట్లాడుతూ ఆమె చరిత్ర చదివానని, అమ్మానాన్న కమ్యూనిస్టులు ఆమె గురించి వారు చెప్పిన అంశాలు, వారు పనిచేస్తున్న తీరు చూస్తూ పెరిగానని అన్నారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎంతో వెనుకబడి ఉన్న సమయంలోనే ఆమె ముం దుకు వచ్చి వాటిపై తిరుగుబాటు చేయడం ప్రతి సమస్యపై ప్రశ్నించడం ఎదిరించడం చేశారన్నారు.

నేటి యువత అమ్మను ఆదర్శంగా తీసుకుని మహిళల హక్కుల కోసం ప్రశ్నించాలని ఆమె గురించి విన్న ప్రతిసారి శరీరంపై రోమాలు నిక్కబడుచుకుంటాయని దొరలకు వ్యతిరేకంగా అమ్మ అటువంటి పోరాటాలు చేశారు ఆ పోరాట స్ఫూర్తిని యువత కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకురాలు టి. జ్యోతి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పి ఓ డబ్ల్యు జాతీయ అధ్యక్షురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు.