19-03-2025 08:25:13 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల వీర తెలంగాణ సాయుద రైతాంగా పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలో సుందరయ్య స్మారక భవనము నందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, చందా చంద్రయ్య, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు ఆర్పించారు. బుధవారం మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభ చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటి సభ్యుల బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ... కామ్రేడ్ మల్లు స్వరాజ్యం నిజం రాజు రాచరిక పాలన, దొరల భూస్వాముల వెట్టి చాకిరి వ్యతిరేకంగా మట్టి మనసుల గుండె చప్పుడై సమ సమాజం కోసం సాయుద పోరు సమరమై దొరల పెత్తందారు విధానాన్ని నేలా కూల్చిన మహా వీరవనిత మల్లు స్వరాజ్యం అని అన్నారు. నేటి యువతకు ఆమె జీవితం ఆదర్శప్రాయం నేటి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బి కృష్ణారెడ్డి, ఎస్ పిచ్చయ్య, డి ఉపేందర్, జి మల్లారెడ్డి, ఎన్ సైదులు, బి సుందరయ్య, ఎస్ నాగరాజు, కె ఈదయ్య, తదితరులు పాల్గొన్నారు.