20-03-2025 12:00:00 AM
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్
ఇబ్రహీంపట్నం, మార్చి 19 (విజయ క్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీ సామెల్ పిలుపునిచ్చారు. బుధవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సీపీఎం కేంద్ర కమిటీ స భ్యురాలుగా నేటి యువతరానికి ఆదర్శ ప్రాయురాలన్నారు. చిన్న వయసులోనే ఎర్ర జెండాను బట్టి గెరిళ్లా శిక్షణ తీసుకొని సాయుధ పోరాటంలో రజాకార్ల గడగడలాడించారన్నారు. బుగ్గరాములు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.