calender_icon.png 9 October, 2024 | 10:26 PM

ఘనంగా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం

09-10-2024 08:27:19 PM

జిల్లా గ్రంథాలయంలో బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మల్లు నరసింహారెడ్డి 

ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కార్యక్రమం బుధవారం అటాహసంగా జరిగింది. గ్రంథాలయ కార్యాలయంలో మల్లు నరసింహారెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, అనిరుధ్ రెడ్డిల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్నో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అందరికీ సమానమైన హక్కులు వచ్చేలా పదవులు లభిస్తాయని, అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దుర్మార్గమైన పాలనను గద్దె దించాలని, అందరికీ న్యాయంగా అవసరమైన సంక్షేమ పథకాలు అయినా గ్యారెంటీలను అమలు చేసేoదుకు అవసరం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

రాబోయే రెండు సంవత్సరాలలో దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటికోసం కష్టపడ్డ వారికి పదవులు లభిస్తాయని తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ దైవసం చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని తెలియజేశారు. అన్ని జెడ్పిటిసి, జెడ్పిటిసి ఎంపిటిసి, సర్పంచ్, ఎంపీపీ, స్థానాలతో పాటుజడ్పీ చైర్మన్ పదవి   స్థానాలు  కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా  కార్యకర్తలు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. 

మీ అందరికీ అడ్డగా ఉంటాం : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

ఇబ్బందులు అక్కడక్కడ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరికీ అండగా ఉంటే గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే పరిస్థితి అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదని తెలియజేశారు. బిజెపి టీఆర్ఎస్ ఇద్దరు కుమ్మక్కై కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవ్వని హామీలను ముందుకు తెచ్చి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 11 వేల పైగా ఒకేరోజు ఉపాధ్యాయ నియమకల పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించడం జరుగుతుందని, గతంలో ఎప్పుడు కూడా ఇది జరగలేదని తెలియజేశారు. రూ.18 వేల కోట్లు రెండు లక్షల్లోపు రుణమాఫీ చేయడం జరిగిందని తెలియజేశారు.

టిఆర్ఎస్ గతంలో కేవలం 6000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు.  మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారని పాలమూరు బిడ్డ ఎప్పుడూ మాట తప్పరని ప్రతి రూపాయి ఖర్చు కూడా బెట్టి మనందరి సంక్షేమం కోసం సిఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని తెలియజేశారు. దేవరకద్ర నియోజకవర్గం కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చేదిగా చర్యలు తీసుకోవాలని సీఎం దృష్టికి తీసుకుపోవడం జరిగిందని, సిఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాకు సంబంధించి ఎవరు ఏమి అడిగినా కాదు అనకుండా సమస్యను మైనార్టీ పరిష్కరిస్తామని తెలియజేశారు. 

నా జన్మ ధన్యమైంది: జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి 

కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ప్రజల సంక్షేమ కృషి చేసినందుకు సముచితస్థానం లభించడం చాలా సంతోషంగా ఉందని గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. గ్రంధాలయాల అభివృద్ధి కోసం ప్రతిక్షణం కృషి చేస్తానని తెలియజేశారు. గ్రంధాలయాలు పూర్తిస్థాయిలో పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగులు దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయాల్లో పుస్తకాలకు అవసరమైన సదుపాయాలను కల్పించినందుకు తోచిన సహాయం అందించాలని తెలియజేశారు. అభివృద్ధి జరగాలంటే అందరూ కలిస్తేనే జరుగుతుందని మీరు చేసే అతి తక్కువ సహాయంతో ఎంతోమంది విజ్ఞాన్లుగా తయారవుతారని తెలియజేశారు. గ్రంథాలయాలకు ప్రతి ఒక్కరూ సందర్శించి చదువుకునేలా సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.

గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించేందుకు సహకరించిన ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ గారు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్,  గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.