calender_icon.png 23 December, 2024 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లు నందిని కారు అడ్డగింత

14-09-2024 12:50:39 AM

ఖమ్మంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన 

ఖమ్మం, సెప్టెంబర్ 13 ( విజయక్రాంతి): యువజన కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి వేజెళ్ల సాయి ప్యానల్ యువతను ప్రలోభాలకు గురి చేసి, నకిలీ ఓట్లు వేయిస్తుందని ఆరోపిస్తూ మరో ప్యానల్‌కు చెందిన ఓ వర్గం నేతలు శుక్రవారం ఖమ్మంలో నిరసన తెలిపారు. ఖమ్మం వైరా రోడ్‌లోని కోణార్క్ హోటల్‌లో వేజెళ్ల సాయి ప్యానల్ వారు యూత్ ఓటర్లను ప్రలోభ పెట్టి, గెలిపే లక్ష్యంగా అక్రమ  మార్గాన్ని ఎంచుకున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. అటుగా వస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కారును అడ్డుకుని, నిరసన తెలిపారు.

డబ్బు, మద్యంతో ప్రలోభపెడుతున్నారని, అడ్డుకోవాలని నందిని దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆధారాలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వేజెళ్ల సాయి, మహేశ్ ప్యానళ్లపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని మల్లు నందినిని కోరారు. విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శాంతించారు.