calender_icon.png 1 April, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మల్లికార్జున స్వామి కల్యాణం

25-03-2025 12:44:45 AM

మేడ్చల్, మార్చి 24(విజయ క్రాంతి): మేడ్చల్ మండలం పూడూరులో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కల్పనా రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి డోలు వాయించి  ఉత్సాహపరిచారు. 16 లక్షల వ్యయంతో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ ఎంపీపీ జగన్ రెడ్డి, దయానంద్ యాదవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.