calender_icon.png 18 March, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

17-03-2025 06:26:40 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ లో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, డైరెక్టర్లు రేపు రాజు, దుర్గం శివశంకర్, మాజీ కౌన్సిలర్ లు కౌ డే మహేష్, చాపరాజు, రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, జాకాట దేవా, బత్తుల శివకుమార్ తూముకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మహేందర్ యాదవ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, దుర్గం వెంకటేష్, నడికొప్పు రంజిత్, వేముల రంజిత్ రెడ్డి, లవంగు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.