05-04-2025 12:58:27 AM
ఆమనగల్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి ) : యువత అంతా మల్లేష్ యాదవ్ ను ఆదర్శంగా తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయ కులు శ్రీకాంత్ సింగ్ కోరారు. శుక్రవారం ఆమనగల్ పట్టణంలో మల్లేష్ యాదవ్ ను బిజెపి శ్రేణులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఇటీవల వెల్లడించిన గ్రూప్ -1 ఫలితాల్లో అమనగల్ పట్టణానికి చెందిన కావట్టి మల్లేష్ యాదవ్ రాష్ట్రస్థాయిలో 187 వ ర్యాంకు మల్టీ జోన్ 2 విభాగంలో 92వ సాధించాడు. ఇప్పటికే మల్లేష్ ప్రతిభ చూపించి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.