calender_icon.png 19 April, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ, అమిత్ షాలను విమర్శించే స్థాయి అద్దంకికి లేదు

18-04-2025 09:59:14 PM

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు

తుంగతుర్తి,(విజయక్రాంతి): నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ లను ఈడి ఎక్కడ అరెస్ట్ చేస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాపై పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో సాయిబాబా మాట్లాడుతూ.. అద్దంకి దయాకర్ కు నోటి దూల ఎక్కువ అని గతంలో సొంత పార్టీ నాయకుల పైన ఇదే విధంగా మాట్లాడితే సొంత పార్టీ కార్యకర్తలు దాడికి సిద్ధపడ్డారని అన్నారు.

దయాకర్ టీవీ నటుడని ఆయన టీవీల మీద స్టేజీల మీద తప్ప ఎక్కడ కనపడని అలాంటి వ్యక్తి నిరంతరం దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మోడీ అమిత్ షా లను ఒక దేశ ప్రధాని అని గౌరవం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.దయాకర్ చదువుకున్న చదువు ఇదే సంస్కారం నేర్పిందా అని  పాకిస్తాన్ ను ప్రేమించేటోనికి భారతదేశాన్ని అభివృద్ధి చేసే మోడీ అంటే కోపమే ఉంటుందని అన్నారు. పిచ్చి మాటలు మానుకొని వచ్చిన పదవితో ప్రజలకు సేవ చేయాలని సూచించారు.