calender_icon.png 27 February, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్‌ను కలిసిన మల్లెమడుగు జెడ్పీ విద్యార్థులు

26-02-2025 12:24:52 AM

ఖమ్మం, ఫిబ్రవరి -25 (విజయక్రాంతి) : మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థులు మంగళవారం రాష్ర్ట గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. పీఎం శ్రీ పథకం క్రింద ఎక్స్ ప్లోజివ్ విజిట్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ ప్రోద్బలంతో రాజ్ భవన్ ను విద్యార్థులు సందర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అమలు అవుతున్న కిచెన్ గార్డెన్స్ విధానం గురించి గవర్నర్ తెలుసుకున్నారు.

పాఠశాలలో పండించే కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడాన్ని గవర్నర్ అభినందించారు.విద్యార్థులు గవర్నర్ కు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థులు గీసిన గవర్నర్ చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు.

అనంతరం రాష్ర్ట గవర్నర్ ను విద్యార్థిని విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ అధికారి రామకృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ వేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.