calender_icon.png 18 April, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లయ్య యాదవ్ క్షమాపణ చెప్పాలి

09-04-2025 10:15:15 PM

చిలుకూరు: మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బుధవారం చిలుకూరు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కీత వెంకన్న మాట్లాడుతూ... గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన బిఆర్ఎస్ పార్టీ, రైతులకు సరిగా నీరు ఇవ్వకుండా వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని బహిరంగానే కేటీఆర్, ఆనాడు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలంగాణలో సస్యశ్యామలంగా నీరు అందిస్తున్నారని, ఇకనైనా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి పుల్లారావు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సొందుమియా, కొడారు బాబు, హస్నా, లింగయ్య, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.