16-04-2025 12:13:04 AM
మేడ్చల్, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం మల్లారెడ్డి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 20 న ఆన్ లైన్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నామని యూనివర్సిటీ ఫౌండర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్ర రెడ్డి, వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ వి ఎస్ కె రెడ్డి తెలిపారు.
మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాక్ టెస్ట్ విద్యార్థుల సన్నద్ధతను సమీక్షించడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలన్న సంకల్పంలో భాగంగా మెరిట్ స్కాలర్షిప్ లను అందజేస్తామన్నారు.
యూనివర్సిటీ ద్వారా అందించబడుతున్న అన్ని కోర్సులకు సంబంధించిన మొదటి 500 మెరిట్ ఆధారిత అడ్మిషన్లకు స్కాలర్ షిప్ అందజేస్తామన్నారు. స్కాలర్షిప్ వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక వెసులు బాటు కలుగుతుందన్నారు.