06-03-2025 06:15:34 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో పెద్దమ్మ విగ్రహం ప్రతిష్టాపనలో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు మల్లారెడ్డిని శాలువాతో సన్మానించారు. బోడుప్పల్ లోని 15వ డివిజన్ లక్ష్మీనగర్ లో నల్ల పోచమ్మ, నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.