calender_icon.png 22 October, 2024 | 7:01 AM

సంగీత్‌లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్

22-10-2024 03:28:47 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, విజయక్రాంతి : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎప్పుడూ తన డైలాగ్‌లు, డ్యాన్స్‌లతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సందర్భం ఏదైనా తనదైన యాస, భాషతో జనాల్ని ఉర్రుతలూగిస్తారు. పాలమ్మినా, పూలమ్మిన అని ఇదివరకు మల్లారెడ్డి చెప్పిన మాస్‌డైలాగ్ ఎంత  పాపులర్ అయ్యిందో మనందరికీ తెలుసు. తాజాగా తన మనువరాలి పెళ్లి సంగీత్‌లో మల్లారెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు.

నల్లకళ్లద్దాలతో యువకులకు దీటుగా ఆయన వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. మరోసారి సోషల్ మీడియాలో మల్లారెడ్డి డ్యాన్స్ వైరల్‌గా మారింది.  మల్లారెడ్డి తనయుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈనెల 27న జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం నగరంలో నిర్వహించిన సంగీత్‌లో మల్లారెడ్డి స్టెప్పులేసి అతిథుల్లో జోష్ నింపారు. కొరియోగ్రాఫర్‌తో శిక్షణ తీసుకుని మరీ ప్రత్యేక స్టెప్పులు వేశారు.