22-02-2025 12:00:00 AM
తలకొండపల్లి, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయితీ పరిదిలోని ఎత్తున కొండలపై వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు 7రోజుల పాటు నిర్వహిస్తు న్నట్లు ఆలయ కమిటి అద్యక్షుడు మాకం పాండయ్య,గౌరవాద్యక్షుడు ఎమిరెడ్డి పాండు రంగారెడ్డిలు తెలిపారు. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్క రించుకొని నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఆలయ చరిత్ర
చెన్నారం సమీపంలోని మల్లప్ప గుట్ట హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారికలో విఠాయిపల్లి గ్రామం నుండి చెన్నారం వెళ్లే రహదారిల్లో 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండపై కొలువుదీరిన మల్లిఖా ర్జున స్వామి మూల విరాట్టును సుమారు 1000 సంవత్సారాలకు పూర్వం మునులు ప్రతిష్టించిన ఆనవాళ్లు ఉన్నాయి.
ఈ కొండపై మునులు తపస్సు చేసేవారని ఇతిహాసాలు చెపుతున్నాయి.కొండపై ఉన్న కోనేరులో ఏడాది పొడుగున నీరు ఉంటుంది.ఈ కోనేరులో ఉన్న నీటికి శ్రీశైలం ప్రాజెక్టు నీటికి లింక్ ఉన్నట్లు చెబుతారు.శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిందితే కొండపై ఉన్న కోనేరులో నీరు నిండి బయటికి పారుతుంది.
దాతల సహకారంతో అభివృద్ధి..
కొండపై ఉన్న పురాతన ఆలయన్ని దాతల సహకారంతో అభివృద్ది పరుస్తు న్నారు. దేవవాలయం ముందు 110 ఫిట్ల పొడవు 60ఫిట్ల వెడల్పుతో పెద్ద మండపం నిర్మించారు. గుట్టపైకి గతంలో వెళ్లడానికి భక్తులు ఇబ్బందులు పడెవారు ప్రస్తుతం రూ.75 లక్షలతో సిసి రోడ్డు నిర్మించడంతో వాహనాలు సైతం కొండపైకి వెలుతు న్నాయి. భక్తుల సౌకర్యర్థం గదులు నిర్మించారు.
రోజు వారి పూజా కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల మొదటి రోజు 22న సాక్షి గణపతి విగ్రహ ప్రతిష్ట, అంకురార్పణ, ద్వజారోహనం, 23న గణపతి పూజ,యంత్ర ప్రతిష్ట,పూర్ణాహుతి, 25న తెల్లవారు జామున అగ్నిగుండ మహోత్సవం, ప్రత్యేక పుజాలు, 26న శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల కల్యాణ మహోత్సవం,27న చుక్కాపూర్ నుండి కడవ(బోనాలు),28న చక్ర తీర్థం పెద్ద మంగళహారతి కార్యక్ర మాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు.
26న జరిగే స్వామి వారి కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలు హాజరౌతున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వివరించారు.