calender_icon.png 10 March, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో మల్లన్న ఆలయం కిటకిట

10-03-2025 01:12:21 AM

 చేర్యాల, మార్చి 9:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలించారు. బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఎనిమిదో వారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా రెండు వారాల్లో బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతున్న నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తుల రద్దీకి తగ్గట్లు ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు చేశా రు. భక్తులు ఆదివారం వేకువ జామునే లేచి, స్వామివారి పుష్కరిలో పుణ్య స్నానాలు  ఆచరించారు.

అనంతరం వేకువ జామున 4 గంటల నుండి స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లో భక్తులు నిల్చున్నారు. స్వామివారి ఆలయ ద్వారం తెరవగానే గర్భగుడిలో ఉన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు మొక్కుకున్న మొక్కులు ప్రకారం కొందరు ముఖమండపం, మరికొంతమంది భక్తులు గంగిరేణి చెట్టు వద్ద బోనం నైవేద్యంగా సమర్పించి, పట్నాలు వేసి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకున్నారు. అనం తరం గుట్టపై నున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు నైవేద్యంగా సమర్పించి, బియ్యాలు పోసి భక్తితో తల్లిని వేడుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కే రామాంజనేయులుతో పాటు పాలకమండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి, అల్లం శ్రీనివాస్‌లు భక్తులకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 అధికారుల నిర్లక్ష్యం 

 భక్తులు ఎంతో పవిత్రంగా ఉండి, ఉపవాసాలతో పాటు భక్తిశ్రద్ధలతో మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. కానీ ఆలయ అధికారులు, గ్రామ పంచాయితీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తూన్న వాటి పైనుంచి భక్తులు నడుచుకుంటూ  స్వామివారిని దర్శించుకోవడ మే కాక, నెత్తిన  బోనాలతో అమ్మవారికి సమర్పిస్తున్నారు. నెలరోజుల నుంచి రోడ్డు పై మురికి నీరు పారుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జెసిబి తో గుంతలు తీసి, పైపులు వేశారు కానీ, కనెక్షన్ ఇచ్చి , గుంత లు పూడ్చితే సమస్య పరిష్కారం అవుతుంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.