మూడో వారం కిక్కిరిసిన భక్తులు
చేర్యాల, ఫిబ్రవరి 2: మల్లన్న బ్రహోత్సవాల్లో మూడో ఆదివారం ఆలయం భక్తజ నసంద్రంగా మారింది. శనివారం సాయం త్రం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం తెల్లవాజాము నుంచే కొలనులో పుణ్య స్నానాలు ఆచరించి గర్భగుడిలో మల్లన్నస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ముఖమండపం వద్ద ఉన్న గంగిరేణి చెట్టుకింద పట్నాలు వేసి, బోనం నైవేద్యంగా సమర్పించారు.
గుట్టపై ఉన్న ఎల్లమ్మతల్లికి ప్రత్యేక బోనం చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల తాకిడితో దర్శనానికి సుమారు రెం డు గంటల సమయం పట్టింది. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈ వో రామాంజనేయులు తెలిపారు.
జాతర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగాకుండా చేర్యాల సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. ఆలయ పాలకమండలి సభ్యులు అల్లం శ్రీనివాస్, అంజిరెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్య వేక్షించారు.