calender_icon.png 13 January, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిటకిటలాడిన మల్లన్న ఆలయం

13-01-2025 12:31:01 AM

చేర్యాల, జనవరి 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న కళ్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి ధర్మ దర్శనం సుమారు రెండు గంటల సమయం పట్టింది.

రాజగోపురం, కోనేరు, గంగిరేణి చెట్టు, క్యూలైన్లు ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భక్తుల పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు గంగిరేణి చెట్టు కింద మొక్కుల్లో భాగంగా పట్నం వేసి, బోనాలు నైవేద్యంగా సమర్పించారు. అదేవిధంగా గుట్టపైనున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు నైవేద్యంగా సమర్పించి, కరుణించమని తల్లిని భక్తితో వేడుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం భక్తుల కోలాహలం కొనసాగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా రద్దీకి తగ్గట్లు ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశారు.