ముషీరాబాద్, జనవరి 2 : సంక్రాతి వేడుకల సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ డివిజన్‌లోని మల్లన్న ఆలయంలో ఈనెల 14 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ నల్లబెల్లి అంజిరెడ్డి, మాజీ చైర్మన్ ఊర్మిలా అంజిరెడ్డి తెలిపారు.
ఈ మేరకు గురువారం రాత్రి ఆలయంలో మల్లన్న స్వామికి ఒగ్గుపూజారులు సందము నాగేశ్, జనగ సత్యనారాయణ బృందంచే మైలపోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ట్రస్టీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. జాతర మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మల్లికార్జున్ రెడ్డి, హారికరెడ్డి, యాదగిరి, వైపీ రాజు, ఎం రాజు, సురేష్ కుమార్, అశోక్‌గౌడ్, బాబుచారి, గోపాలకృష్ణ, సూర్యప్రకాష్, వెంకటేశ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.