ముషీరాబాద్ (విజయక్రాంతి): సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం లోని భోలక్‌పూర్ డివిజన్‌లో గల బాకారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయంలో ఈ నెల 14 నుండి 16 వరకు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్ట్ నల్లబెల్లి అంజిరెడ్డి, మాజీ చైర్మన్ ఊర్మిలా అంజిరెడ్డిల ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఆలయంలో మల్లన్న స్వామికి మైలపోలు మేలుకొలుపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఒగ్గుపూజారులు సందము నాగేష్, జనగ సత్యనారాయణ బృంధంచే మైలపోలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ట్రస్ట్ నల్లబెల్లి అంజిరెడ్డి మాట్లాడుతూ.. మల్లన్న జాతర మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మల్లికార్జున్ రెడ్డి, హారిక రెడ్డి, ఎస్. యాదగిరి, వైపీ రాజు, ఎం. రాజు, ఆర్. సురేష్ కుమార్, అశోక్ గౌడ్, ఎ. బాబుచారి, గోపాలకృష్ణ, పి. సూర్యప్రకాష్ ముదిరాజ్, వెంకటేశ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.