calender_icon.png 1 April, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాది పురస్కారం అందుకున్న మల్లన్న అర్చకుడు

31-03-2025 01:27:15 AM

 చేర్యాల,మార్చి 30 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడైన మహాదేవుని మల్లికార్జున్ కు ఉగాది పర్వదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే పురస్కారానికి ఎంపికయ్యారు.

ఈ మేరకు తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్తంగా రవీంద్రభారతిలో ఆదివారం రోజున పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రమా అయ్యర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ చేతులు మీదుగా మహాదేవుని మల్లికార్జున్ ను సన్మానించి, పురస్కా రాన్ని అందజేశారు. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకవృత్తిని మల్లికార్జున్ ఎంచుకున్నారు.

అందుకు కావలసిన అర్హతలు సాధించారు.1996లో మల్లన్న దేవాలయంలో అర్చకునిగా జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. 2020 నుండి ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు. మూడు  దశాబ్దాలుగా మల్లన్న సన్నిధిలో అర్చకుడిగా సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసిం ది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు పాల్గొన్నారు.