calender_icon.png 2 April, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నడ భక్తులతో కిక్కిరిసిన మల్లన్న క్షేత్రం

27-03-2025 01:01:15 AM

 ఇంటి ఆడపడుచుగా భావిస్తూ భ్రమరాంబ మల్లికార్జునలకు చీరసారెలు

 పాదయాత్రగా వెళ్తూ మొక్కులు చెల్లించుకుంటున్న కన్నడ వాసులు

 నాగర్ కర్నూల్ మార్చ్ 26 (విజయక్రాంతి): ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కన్నడ భక్తులు శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తారు. ఇంటి ఇలవేల్పు ఆడపరచుగా భావించే భ్రమరాంబ మల్లికార్జున అమ్మవారికి చీరె సారెలను సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకునేందుకు కాలినడకన శ్రీశైల మల్లన్న ఆలయానికి తరలి వెళ్తున్నారు.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంత వాసుల కంటే కర్ణాటక కన్నడ ప్రాంత వాసులే అత్యధిక సంఖ్యలో ఉగాది పర్వదినాన మల్లన్న దర్శన కోసం శ్రీశైలం వస్తుంటారని గత రెండు రోజులుగా భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు నేటి నుంచి ఈ నెల 31 వరకు స్పర్శ దర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒక్కరోజే శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కోసం లక్షలాదిగా కన్నడ భక్తులు పోటెత్తారు.

ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు. ఎప్పటికప్పుడు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తూ భక్తులకు తాగునీరు, చలువ పందిళ్ళు, మజ్జిగ ఇతర ప్రసాదం వంటివి క్యూ లైన్ లోనే పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే అక్కడికక్కడే వైద్యం అందించేలా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. బుధవారం పాతాళ గంగ వద్ద పుణ్య స్నానాలను ఆచరించి మల్లన్న దర్శనం కోసం భక్తులు తరలి వెళ్లారు.