calender_icon.png 3 April, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న హుండి ఆదాయం రూ. కోటి 11 లక్షలు

29-03-2025 12:00:00 AM

చేర్యాల, మార్చి 28 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీలెక్కింపు శుక్రవారం జరిగింది. ఈలెక్కింపు రామకృష్ణ భజన సేవా సభ్యులు పాల్గొన్నారు. 21 రోజులకు గాను  రూ.  కోటి 11 లక్షల 96 వేల 965 రూపాయలు నగదురాగా,మిశ్రమ బంగారం 112  గ్రాములు, మిశ్రమ వెండి 9  కిలోల 200  గ్రాములు, విదేశీ కరెన్సీ 24 నోట్లు, మిశ్రమ బియ్యం 20 క్వింటాళ్లు లభించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కే రామాంజనేయులు తెలిపారు.

ఈ లెక్కింపు అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పాలక మండల సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి, అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.