calender_icon.png 23 February, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న హుండీ ఆదాయం రూ. 78లక్షలు లెక్కింపు

21-02-2025 12:00:00 AM

చేర్యాల, ఫిబ్రవరి 20: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండి లెక్కింపు గురువారం జరిగింది. ఈ హుండి లెక్కింపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. లెక్కింపులో శ్రీ లలిత  సేవా ట్రస్ట్ సమితి సభ్యులు పాల్గొన్నారు.19 రోజులకు గాను రూ.78 లక్షల 31 వేల 047 రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగారం 82 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోల 100 గ్రాములు, విదేశి కరెన్సీ 130 నోట్లు, మిశ్రమ బియ్యం 13 క్వింటాళ్లు లభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు తెలిపారు.

శబరేశ్వర ఆలయం కార్యనిర్వాహణాధికారి రవికు మార్ పర్యవేక్షణలో  ఈ లెక్కింపు జరిగింది.  ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, సహయ కార్యనిర్వాహణాధి కారి బుద్ధి శ్రీనివాస్, పాలకమండలి సభ్యు లు జయప్రకాశ్ రెడ్డి, అల్లం శ్రీను, కాగిత మోహన్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.