calender_icon.png 13 February, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సల్లనంబళ్ళ మొక్కులు చెలించుకొన్న భక్తులు

12-02-2025 11:30:50 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా రూరల్ మండలంలోని ముజ్గీ గ్రామంలో నిర్వహిస్తున్న మల్లన్న జాతరలో భాగంగా రెండవ రోజు సల్లనంబళ్ళు (సల్లకుండలు) భోనాలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణిమను పురష్కరించుకొని మల్లన్న స్వామీకి పెద్ద ఎత్తున భోనాలు సమర్పించారు. నిర్మల్ జిల్లాలో పాటు నిజమాబాద్, జగిత్యాల ఆదిలాబాదు మంచిర్యాల జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సల్ల నంబళ్ళతో భోనాలు సమర్పిస్తే ఏడాది కాలం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్దిగా పండుతాయని పశుపోషన పెరుగుతుందని భక్తుల విశ్వాసం. యాధవులు ప్రత్యేక పూజలు ఆచారాలతో నిర్వహించారు. భోనాల జాతరను పురష్కరించుకోని పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం రథోత్సవం నిర్వహించనున్నారు.