calender_icon.png 3 April, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న బుకింగ్ ఆదాయం రూ.76 లక్షలు

26-03-2025 12:00:00 AM

 చేర్యాల, మార్చి 25: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బుకింగ్ ఆదాయం రూ.76 లక్షల రూపాయలు సమకూరినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కే రామాంజనేయులు తెలిపారు. బ్రహ్మోత్సవాల లో భాగంగా గత తొమ్మిది వారాల రికార్డును బ్రేక్ చేస్తూ అత్యధికంగా రూ. 76 లక్షల 13 వేల 190 రూపాయలు ఆదాయం సమ కురింది. ఆలయానికి సంబంధించి వివిధ రకాల దర్శనాల ద్వారా, లడ్డు ప్రసాదాల విక్రయాల, ఆర్జిత సేవలు, వసతి గృహాల అద్దెల ద్వారా ఈ ఆదాయం లభించింది. శని ఆది సోమ వారాలు బుకింగ్ ఆదాయం. బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది.

 షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట ద్వారా 20 లక్షలు 

 ఆలయ పరిధిలోని రాతి గిరల వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ షాపులకు ఆలయ అధికారులు సీల్ కం బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. మొత్తం 21 షాపులు సంవత్సరం పాటు నిర్వహించుకోవడానికి వేలం పాటలు నిర్వహించారు. హెచ్చు పాట పాడిన వారికి షాపులు కేటాయించారు. మొత్తం 21 షాపుల అద్దె ద్వారా ఆలయానికి రూ. 20 లక్షల 22వేల రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.