calender_icon.png 26 December, 2024 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులు

07-09-2024 12:26:41 AM

  1. 508 ఎకరాల భూ సేకరణకు సర్వే 
  2. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ 

అలంపూర్, సెప్టెంబర్ 6: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో త్వరలో అలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ పనులను ప్రారంభించనున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ వెల్లడించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శుక్రవారం సంపత్‌కుమార్ అలంపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ పనులకు 508 ఎకరాల భూసేకరణ పనులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.