calender_icon.png 16 January, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లమ్మకు రెండు పెన్షన్లు

14-07-2024 12:31:34 AM

2014 నుంచి ఇది కొనసాగుతోంది

అందుకే రికవరీకి ఆదేశాలు వచ్చాయి

మంత్రి సీతక్క వివరణ

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతోంది. ఆమె అవివాహిత కుమార్తె రాజేశ్వరి ఏఎన్‌ఎంగా పనిచేస్తూ మరణించగా, ఫ్యామిలీ పెన్షన్ కింద నెలకు రూ.24,073 అందుతోందని మంత్రి సీతక్క తెలిపారు. మల్లమ్మ ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా మరొకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. కుమా రుడితో పాటు సొంత పక్కా ఇంట్లో మల్లమ్మ నివసిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఒకే వ్యక్తి రెండు రకాల పెన్షన్లు తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవు.

రాష్ర్టవ్యాప్తంగా వృద్ధాప్య, ఫ్యామిలీ పెన్షన్లను 1,826 మంది పొందుతున్నట్టు ట్రెజరీశాఖ ఈ మధ్యనే గుర్తించి రికవరీ నోటీసులు పంపిందని చెప్పారు. ఆ ప్రక్రియలో భాగంగానే వృద్ధా ప్య, ఫ్యామిలీ పెన్షన్లను అందుకుంటున్న మల్లమ్మకు సైతం నోటీసులు పంపారని, వాస్తవాలు ఈ రకంగా ఉంటే ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కొందరు ప్రభుత్వాని కి దురుద్దేశాలను ఆపాదిస్తున్నారని ఆరోపించారు. ఎందరో అర్హుల కు పెన్షన్లు అందించ కుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచిస్తోందని, అర్హులందరికి పెన్షన్ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు.