* మందకృష్ణ మాదిగ
ముషీరాబాద్, జనవరి 26: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ పార్టీలోని కొందరు మాలలు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగా ణ ఎరుకల ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఫిబ్రవరి 7న ‘లక్ష డప్పులు గొంతుకలు’ అనే కార్యక్రమానికి ఎరుకల ఆదివాసీ సంఘం మద్దతు ప్రక టించింది.
మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని, కానీ పార్టీలోని కొందరు మాలలు అడ్డుపడుతున్నారన్నారు. గిరిజనుల సమస్య ల పరిష్కారానికి ఎస్సీ వర్గీకరణే మార్గమని, ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్టీవర్గీకరణ సులభతరం అవుతుందన్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్య మాన్ని గుర్తించి ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి తనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో తెలంగాణ ఎరుకల ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు, బీజే పీ నాయకులు వంశ తిలక్, గంజీ వంశీ, మందుల శ్రావణ్, రాము, బాబు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు గుండేటి శంకర్ పాల్గొన్నారు.