calender_icon.png 27 April, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ అవార్డుకు మాల్ గ్రామపంచాయతీ ఎంపిక

27-04-2025 12:03:31 AM

అధికారులను అభినందించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

యాచారం ఏప్రిల్ 26  : మండలంలో మాల్ గ్రామపంచాయతీ  నేషనల్ అవార్డు ను ప్రధానమంత్రి మోడీ చేతుల మీద   అవార్డును అధికారులు అందుకున్నారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంత నిధులతో ఆదాయ వనరులు సమకూర్చిన  సందర్భంగా గ్రామపంచాయతీ నేషనల్ అవార్డు రావడం జరిగింది.

శనివారం క్యాంప్ కార్యాలయంలో  ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డి  అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఎంపీఓ శ్రీలత, పంచాయతి కార్యదర్శి ఎర్రం రాజు,  వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, లిక్కి రాజారెడ్డి తదితరులు   పాల్గొన్నారు.